సిరిసిల్ల న్యూస్: ఎల్లారెడ్డిపేట:
రాజన్నసిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఈ నెల 6న యువ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. ఈ యువ సమ్మేళనంనుకు మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హజరుకానున్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కేటీఆర్ సభకు స్థల పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, జడ్పీటీసీ చీటీ లక్ష్మణ్ రావు, ఎంపిపి పిల్లి రేణుక కిషన్, నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.