ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సోమవారం జరిగే యువకుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ ను యువకులు ప్రశ్నించాలని ఆదివారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులకు మంత్రి ఏం చేశాడని ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చదువుకున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదన్నారు నిరుద్యోగులకు ఉద్యోగాల నోటిఫికేషన్లు వేస్తూ వాటిని రద్దు పరచడం జరిగిందన్నారు. చదువుకున్న యువకులకు నిరుద్యోగ భృతి ఇస్తానని ఆ హామీని ఇప్పటివరకు నెరవేర్చలేదన్నారు.రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయలేకపోయినా అసమర్త ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి,నాయకులు సూడిద రాజేందర్, భానొతు రాజనాయక్, కొత్తపల్లి దేవయ్య,ఎండి హిమాం, మర్రి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.