సిరిసిల్ల న్యూస్: ఎల్లారెడ్డిపేట
మంత్రి కేటీఆర్ దత్తత గ్రామంలో ఏ ఒక్క పథకానికి నోచుకోలేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన ప్రచారంలో అన్నారు.ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామం మంత్రి కేటీఆర్ దత్తత క్రమంగా అయి ఉండి ఇంతవరకు ఏ ఒక్క పథకాలను నోచుకోలేమని గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులతో అన్నారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజన్నపేట గ్రామం తో పట్టు కిస్టు నాయక్ తండా గ్రామాలలో గురువారం ప్రచారాన్ని జోరుగా సాగించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వెయ్యాలని, అన్ని పథకాలను మీ ముందుకు వచ్చేలా చేస్తామని అక్కడ ప్రజలకు పార్టీ నాయకులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.