యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం, ప్రశాంత జీవనం సొంతం
ప్రతి ఒక్కరూ యోగ దైనందిన జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యంపై పట్టుసాధించవచ్చు.
జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో ఘనంగా అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలు.
- జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపీఎస్
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరి సంపూర్ణమైన ఆరోగ్యం కోసం భారతదేశ ప్రాచీన వారసత్వం ఇచ్చిన విలువైన కానుక యోగా, యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం, ప్రశాంత జీవనంతో ఆరోగ్యంపై పట్టు సాధించవచ్చని జిల్లా ఎస్పీ అన్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శనివారం రోజున పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నిత్యం బిజీ బిజీ గా ఉండే అధికారులు, సిబ్బంది నిత్యం యోగా సాధనతో తమ ఆరోగ్యంపై పట్టుసాధించన్నారు.అధికారులు, సిబ్బంది నిత్యం విధినిర్వహణలో ఉండటం వలన తమ ఆరోగ్యం పట్టించుకోకపోవడంతో ఎన్నో రకాల అనారోగ్యాలకు గురవుతున్నారని అధికారులు,సిబ్బంది ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు సమర్థవంతంగా సేవాలందించగలని అన్నారు.
భారతీయతత్వం ప్రతిపాదిస్తున్న సార్వత్రిక విలువల్లాగే యోగా కూడా విశ్వవ్యాప్త భావనను, ప్రాపంచిక ధృక్పథాన్ని బోధిస్తుందన్నారు.అన్ని దేశాల్లోనీ ప్రజలు యోగాలోని శక్తిని, ప్రాముఖ్యతను రోగనిరోధక సామర్థ్యాన్ని గుర్తించి యోగా ను వినియోగంలోకి తీసుకొచ్చాయనీ అన్నారు. మిగతా ఎక్సర్సైజ్ ల్లా గా కాకుండా, ఎక్కడైనా, ఎలాంటి వ్యాయామ పరికరాలు అవసరం లేకుండా ఖర్చు లేకుండా ఆరోగ్యాన్ని మానసిక సమతుల్యత లభించే ఏకైక మార్గం యోగ అని తెలుపారు. యోగా ద్వారా మెరుగైన జీవనం, అద్భుతమైన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం, ఉత్తమ ఆలోచనలు కలుగుతాయన్నారు. పోలీస్ అధికారులు,సిబ్బంది యోగాను దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకోవడం ద్వారా ఆనందకర జీవితాన్ని పొందగలరని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ అరగంట,గంట పాటు యోగా చేస్తే చాలా వరకూ అనారోగ్యం పాలుకాకుండా ఒత్తిడి వంటివి లేకుండా ప్రశాంత జీవనం సొంతం అవుతుందన్నారు.
అనంతరం యోగ గురువు ని వారి శిష్యులను జిల్లా ఎస్పీ అభినందించి మెమోంటోస్ అందజేశారు.
ఈ కార్యక్రమంలో వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, సి.ఐ లు, ఆర్.ఐ లు, ఎస్.ఐ లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.









