100 రూపాయలకే 76 లక్షల లగ్జరీ కారు సొంతం చేసుకునే ఓ ఆఫర్ ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తోంది. ఈ ఆఫర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఓ లగ్జరీ కారు, అదికూడా 76 లక్షల రూపాయల విలువ చేసేది 100 రూపాయలకే వస్తుంది అంటే ఎవ్వడు మాత్రం ఊరుకుంటారు చెప్పండి. అందుకే ఇక్కడో ట్విస్ట్ ఉంది. 100 రూపాయలు చెల్లించి మన అదృష్టాన్ని పరీక్షించుకోవడమే అసలు ట్విస్ట్. ఎస్.. ఇది ఓ లాటరీ స్కీం. అస్సాంలోని బార్‌పేట జిల్లాలో హౌలీ లో ఈ తరహా లాటరీ ఒకటుంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
అస్సాంలోని బార్‌పేట జిల్లాలో ప్రతి సంవత్సరం రాస్ మహోత్సవ్ ను వేడుకగా జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది హౌలీ రాస్ మహోత్సవం 95వ సంవత్సరాన్ని పూర్తి చేసుకుంది. ఇక్కడ లక్షలు, కోట్ల విలువ చేసే ల్యాటరీల కోసం టికెట్ లు విక్రయిస్తుంటారు. కానీ లక్ అనేది కొద్ది మందికే ఉంటుంది.. అస్సలు ఏమాత్రం మనకు ఎక్కడ వస్తుందని ల్యాటరీ టికెట్ తీసుకున్న వారికి కొన్నిసార్లు ఊహించని లక్ కలిసి వస్తుంది. రాత్రికి రాత్రే కోటీశ్వరులైన సంఘటనలు కొకొల్లలు ఉన్నాయి.
భారతీయ సాంప్రదాయ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం కాటి మాసంలో పూర్ణిమ తిథిలో జరుపుకుంటారు. ఈ సంవత్సరం రాస్‌ను నవంబర్ 24 నుండి డిసెంబర్ 10 వరకు హౌలీ, బార్‌పేటలో జరుపుకుంటున్నారు. 96 వ హౌలీ రాస్ ఫెస్టివల్ సెలబ్రేషన్ కమిటీ ఈ సారి కూడా లాటరీ నిర్వహిస్తూ ఆ వివరాలు తెలిపింది. 100కి ఈ లగ్జరీ గిఫ్ట్ కూపన్ గేమ్‌లో అదృష్టం మీతో కలిసి ఉంటే మీరు కూడా లగ్జరీ వాహనాన్ని సొంతం చేసుకోవచ్చు అని తెలిపింది.
దీంతో ఈ లాటరీ కౌంటర్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిరోజు టికెట్ల కోసం జనం నానా తంటాలు పడుతున్నారు. అదృష్టవంతుల పేర్లు 10 డిసెంబర్ 2023న ప్రకటించబడతాయి. ఈ లాటరీలో 76 లక్షల రూపాయల రేంజ్ రోవర్ కారును మొదటి బహుమతిగా, అదే విధంగా.. రూ. 50 లక్షల విలాసవంతమైన టయోటా ఫార్చ్యూనర్, స్కార్పియో, స్కోడా కుచక్, నెక్సాన్ కార్లను రెండో బహుమతిగా పెట్టారు. ఈ లాటరీ టికెట్స్ కి స్థానికుల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.