బలగం టివి, తంగళ్ళపల్లి
ప్రజలు ఓడించిన.. బీఆర్ఎస్ లీడర్లకు బుద్ది రాలేదు
గలీజ్ మాటలకు బీజం వేసింది టిఆర్ఎస్
ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తెలంగాణ సంపదను దోచుకున్న కేసీఆర్ను కేటీఆర్ ను మీరు చెప్పులతో కొట్టాలి.
మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ జే టోనీ
ఇస్టమొనచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరిక

అధికారంలో ఉన్నప్పుడు అవే అహంకారపు మాటలు..ఇప్పుడు అలానే మాట్లాడుతే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక
మీ అహంకారాన్ని సహించలేక ప్రజలు ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్పిర్రు..అయిన మీకు బుద్ది రాలేదని ఎద్దేవా
ఇప్పటికైన తప్పులను సరిదిద్దు కొండి..దిగాజారి మాట్లాడితే ఊరుకునేది లేదు ఒళ్ళు దగ్గర పెట్టుకోండనీ హెచ్చరిక
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు
కామెంట్స్//
తొమ్మిదేళ్లు అధికారంలో ఉండి ప్రజలకు ఏం చేయలేని సన్యాసులు.. అధికారం కోల్పోయి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు
మిరు తిట్టాకంటే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయని కేసీఅర్,కెటిఆర్ లను తిట్టాలి
రాష్ట్రాన్ని దోచుకుని నిరంకుశ పాలన సాగించిన మీ బీఆర్ఎస్ నేతలను తిట్టాలి
ఈ రాష్ట్రానికి ఇలాంటి బాషా సంస్కృతి నేర్పిన ఘనత బీఆర్ఎస్ పార్టీది
గతంలో కాంగ్రెస్ పార్టీ నేతలపై తీసుకున్న చర్యలు లాగానే బీఆర్ఎస్ నేతలపై సైతం పోలీసులు వ్యవహరించాలి
మరోసారి సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలపై అవాకులు చెవాకులు పేలితే సహించేది లేదని హెచ్చరిక
సీఏం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బల్కా సుమన్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్
అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్
ఈ కార్యక్రమ0 లో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు, గ్రామ అధ్యక్షులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు,సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొనడం జరిగింది