బలగం టీవి, బోయినిపల్లి :
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల ఎస్సై శ్రీకాంత్ నూతన బాధ్యతలు చేపట్టిన సందర్భంగా నీలోజిపల్లి గ్రామానికి చెందిన యువకులు ఎస్ఐ శ్రీకాంత్ ను బుధవారం రోజున మర్యాదపూర్వకంగా కలిసి, సాల్వ కప్పి, పూల బొకే అందజేసి, ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కూస నరేష్ కుమార్, అనుముల శ్రీకాంత్ రెడ్డి, కూస అంజిరెడ్డి, కూస శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.