బలగం టివి, తంగళ్లపల్లి
ఆటలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని గ్రామీణ యువత జిల్లా,జాతీయ స్థాయి క్రీడల్లో రాణించి అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని పేర్కొన్నారు.ఈ సందర్భంగా
రాళ్ళపేట గ్రామంలో జరుగుతున్న క్రికెట్ పోటీల్లో పాల్గొంటూన్న మండేపల్లి ఎంసీసీ జట్టుకు టిషర్ట్స్ అందజేశారు.గ్రామాల్లో ఉన్న యువకులకు క్రీడల్లో ప్రోత్సాహించడానికి తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందజేస్తానని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమంలో మండేపల్లి కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు నరేష్,పరుశురాం మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.