బలగం టివి, తంగళ్ళపల్లి
– బిఆర్ఎస్ నేత బొల్లి రామ్మోహన్

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో మెగా టోర్నమెంట్ ని బి ఆర్ఎస్ సీనియర్ నాయకులు బొల్లి రామ్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా యువత చదువుల తో పాటు క్రీడల్లో రాణించాలని క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయని అన్నారు. మెగా టోర్నమెంట్ లో గెలిచిన వారికి విన్నర్ కప్ 6000 రూపాయలు, రన్నర్ ఆఫ్ కప్ గా 4000 రూపాయలు ప్రకటించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొయ్యడరమేష్,మైనార్టీ నాయకులు షేక్ అబుబకర్, బిఆర్ఎస్ యూత్ నాయకులు అమర్ రావు,సుంకటి రమేష్, రాజేశ్వరరావు,జీవన్,మహేష్, జగదీష్,నిఖిల్,నవీన్, సారంపల్లి గ్రామ క్రికెట్ క్రీడాకారులు, యువకులు,బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.