బలగం టివి, కొనరావుపేట్
ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ అరుణ రాఘవ రెడ్డి మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో అభివృద్ధి జరిగిందని అన్నారు. కెసిఆర్ నాయకత్వంలోని గత ప్రభుత్వం తండలలో ప్రజలు స్వయం పాలన చేసుకోవాలని తండలను గ్రామ పంచాయితీలుగా మార్చింది. తండాలు గ్రామ పంచాయితీలుగా మారిన తర్వాత చాలా అభివృధ్ది చెందుతున్నాయి. పల్లె ప్రగతి కార్యక్రమాలతో గ్రామాల రూపు రేఖలు మారాయన్నారు. మన కొనరావుపేట్ మండలంలో సుమారుగా 5 కోట్ల జడ్పీ నిధులతో పలు అభివృద్ధి పనులను చేయడం జరిగిందన్నారు.
కోనారావుపెట్ మండలంలో 28 గ్రామ పంచాయితీ లకు 22 నూతన గ్రామ పంచాయితీ భవనాలను మంజూరు చేసుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని కోరారు.
ఈ సమావేశంలో స్థానిక సర్పంచ్ గుగులోత రజిత జగన్ నాయక్, ఎంపీటీసీ యాస్మిన్, పాక్స్ ఛైర్మన్ బండ నర్సయ్య, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గోపు పర్శరాములు, ఎంపిడివో రామకృష్ణ, పాలకవర్గం సభ్యులు, కార్యదర్శి, సర్పంచులు, ఎంపీటీసీ లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.